Header Banner

21 రోజుల్లో 31 మంది మరణం! ఎక్కడ, ఎందుకంటే?

  Thu May 15, 2025 11:17        Others

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మూడు వారాలుగా కొనసాగిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్' ముగిసిందని ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 21న ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆపరేషన్‌.. మే 11న ముగిసిందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడమే టార్గెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగిందని స్పష్టం చేశారు.


డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), కోబ్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్... బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కు చెందిన బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని కర్రెగుట్టలను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. మూడు వారాల్లో 28 సార్లు ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు.



ఇది కూడా చదవండి: తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

21 రోజుల్లో 31 మంది మృతి..

అలానే ఈ ఎన్‌కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా.. 18 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని స్పష్టం చేశారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బీజాపుర్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. అంతే కాకుండా ఆపరేషన్‌లో ఇప్పటివరకు 20 మృతులను గుర్తించినట్లు పేర్కొన్నారు.

 

450 మందుపాతరలు..

వెయ్యి మీటర్ల వైరు, 450 మందుపాతరలు, 35 హై పవర్డ్ ఆయుధాలు - SLR, ఇన్సాస్‌, బీజీఎల్ లాంచర్లు, షాట్ గన్స్ - స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా 15 మందుపాతరలను నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బీజాపుర్ నేషనల్ పార్క్ పరిధిలోని మాద్ ప్రాంతం, నారాయణ్‌పుర్‌లో భద్రతా బలగాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.



ఈ విజయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. వామపక్ష తీవ్రవాద నిర్మూలన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని పేర్కొన్నారు. శాంతి నెలకొల్పడం, అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. అలానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దేశ వ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనలో ఇది చారిత్రాత్మక పురోగతి అని అభివర్ణించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామన్నారు.

 

మరోవైపు ఇక మావోయిస్టు పార్టీ తరఫున కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. తమ పార్టీ ఎప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుందన్నారు. కేంద్రం కూడా చర్చలకు సిద్ధంగా ఉందా? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలే మార్గమని అభయ్ పేర్కొంటూ, ప్రజాస్వామిక వాదులు, శాంతికాముకులు, అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందించాలని కోరారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BreakingNews #LatestUpdate #ShockingNews #NewsAlert #TragicInciden